Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరులో శుభకార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు.
కారు బోల్తా పడి కారులో ఉన్న తండ్రీకుమారుడు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మరో మహిళకు తీవ్రగాయాలు కాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతులు నెల్లూరు జిల్లా మర్రిపాడు వాసులుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.