Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మధురై
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మా మక్కళ్ మున్నేట్ర కజగం పార్టీకి చెందిన కార్యకర్తపై దాడి చేశారన్న ఆరోపణలతఆయన మీద కేసు పెట్టారు.
పళనిస్వామి చెన్నై నుంచి మధురైకి వెళ్తున్నారు. శివగంగలో జరగనున్న ఓ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పయనమయ్యారు. ఎయిర్పోర్టులో షెటిల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో రాజేశ్వరన్ అనే ప్రయాణికుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. పైగా దీన్ని ఫేస్బుక్లో లైవ్ వీడియో ప్రసారం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే పళనిస్వామి వ్యక్తిగత సిబ్బంది రాజేశ్వరన్ ఫోన్ లాక్కొని తర్వాత పోలీసులకు అప్పగించారు. మధురై ఎయిర్పోర్టుకు చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బస్సులో జరిగిన ఘటనను తెలుసుకొని రాజేశ్వరన్పై చుట్టుముట్టి దాడి చేశారు. దీంతో రాజేశ్వరన్ పళనిస్వామి, శివగంగ ఎమ్మెల్యే సెంథిల్నాథన్, మాజీ మంత్రి మణికందన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.