Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 30న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారని వివరించారు. సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుందన్నారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తామన్నారు.