Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఛండీగఢ్
పంజాబ్ లో భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ పెరుగుతున్న తుపాకీ సంస్కృతి పై చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని 813 తుపాకుల లైసెన్సులు రద్దు చేసింది. లూథియానా రూరల్‌లో 83 తుపాకుల లైసెన్సులు రద్దు చేయగా, సహీద్ భగత్ సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగ్రూర్ నుంచి 16 తుపాకుల లైసెన్సులను రద్దు చేశారు.
అమృత్సర్ కమిషనరేట్‌లోని 28 మంది, జలంధర్ కమిషనరేట్, ఇతర జిల్లాల నుంచి 11 మంది లైసెన్సులు రద్దయ్యాయి. పంజాబ్ ప్రభుత్వం ఇంతవరకూ 2,000కు పైగా ఆయుధాల లెసెన్సులను రద్దు చేసింది. గన్ల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి తుపాకులు తీసుకు వెళ్లడం, ప్రదర్శించడంపై ప్రస్తుతం నిషేధం ఉందని, రాబోయే రోజుల్లో విస్తృతంగా తుపాకుల తనిఖీలు ఉంటాయని తెలిపింది.