Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కేసీఆర్కు సీటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కడుపులో చిన్నఅల్సర్ ఉన్నట్లుగా తేలింది. కాగా, సీఎం కేసీఆర్తో ఆస్పత్రికి వెళ్లిన వారిలో ఆయన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.