Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. తాజాగా బండి సంజయ్- అరవింద్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ అరవింద్ తప్పుబట్టారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని అరవింద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. 'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది' అంటూ అరవింద్ సూచించారు.