Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్ధాన్‌లోని బికనీర్‌లో బీజేపీ ఎమ్మెల్యే కారు బైకర్‌ను ఢీకొనడంతో అతడి కాలు ఫ్రాక్చరైన ఘటన వెలుగుచూసింది. పట్టణంలోని పీబీఎం ఆస్పత్రి వద్ద బీజేపీ ఎమ్మెల్యే బిహారి లాల్ బిష్ణోయ్ కారు బైకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కాషాయ పార్టీ నేత కారులో ఉన్నారు. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని పీబీఎం ఆస్పత్రి ట్రౌమా సెంటర్లో పనిచేసే వర్కర్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బాధితుడి కాలికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. ప్రమాదం నేపధ్యంలో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణోయ్ తన కారును సమీప పోలీస్ స్టేషన్‌కు పంపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎవరు నడిపారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాగా ఇదేతరహా ఘటనలో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘఢ్‌లో గురువారం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కారు బైకర్‌ను ఢీకొంది. ఇరుకైన రోడ్డులో యూటర్న్ తీసుకుంటుండగా ద్విచక్రవాహనం దిగ్విజయ్ సింగ్ కారును ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యపరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉంది.