Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దొరకలే కొనసాగుతున్న విచారణ
నవతెలంగాణ కంటేశ్వర్
నిజాంబాద్ నగరంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద చిన్నారి కిడ్నాప్ ఘటన వీడని మిస్టరీగా మారింది సుమారు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తున్న ఇప్పటివరకు కిడ్నాప్ కు గురైన చిన్నారి దొరకలే. మరోవైపు కిడ్నాప్ చేసిన నిందితులు దొరకలేదు. పోలీసుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడేళ్ల చిన్నారి అక్యహన్ చిన్నారి కిడ్నాప్ ఘటన మిస్టరీ వీడటం లేదు. సంవత్సరంన్నర గడుస్తున్నా పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. దోషులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు వైఫల్యం చెందారని ప్రజలు విమర్శిస్తున్నారు. నూతన సాంకేతిక ఆధారాలతో కేసులను చేదిస్తున్నామని చెప్పుకునే శాఖ ఇంకా నిందితులను గుర్తించలేక పోవడం గమనార్హం. మెట్పల్లికి చెందిన సల్మాన్, నూరిన్ సుల్తానా తన మూడేళ్ల చిన్నారి అక్యహన్ తో కలసి వివాహాది శుభకార్యం నిమిత్తం 08 అక్టోబర్ 2021 న నగరంలోని ఓ షాపింగ్ మాల్ కు వచ్చారు. షాపింగ్ చేస్తున్న క్రమంలో మూడేళ్ల చిన్నారి అక్యహన్ కిడ్నాప్ కు గురైంది. చిన్నారి కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని బుర్క ధరించిన మహిళ చిన్నారి అక్యహన్ ను కిడ్నాప్ చేసి, ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాలు లో రికార్డ్ అయింది. దీంతో ప్రత్యేక బృందాలతో చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటుగా మహారాష్ట్ర లో పోలీసులు జల్లెడ పట్టారు. సోషల్ మీడియా ద్వారా చిన్నారి ఫోటో వైరల్ గా మారడంతో నాలుగు రోజుల తరువాత నిందితురాలు మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో చిన్నారిని వదిలేసి కిడ్నాప్ చేసిన మహిళ పారిపోయింది. చిన్నారిని పోలీసులు స్వాధీన పరచుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే కిడ్నాప్ చేసిన మహిళ పరార్ కావడంతో, పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు సంవత్సరంన్నర గడుస్తున్న ఇంకా కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అదుపులో తీసుకోలేదు. బుర్కా ధరించి ఉండటం వల్ల నిందితురాలిని పోలీసులు గుర్తించలేక పోయారు. దీంతో పోలీసు శాఖ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్న పోలీసులు ఎందుకు నిర్లక్షం వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నిందితులను వెంటనే పట్టుకొని, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.