Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట ఒకటో సెగ్మెంట్ కాంగ్రెస్ ఎం.పి.టి.సి వేముల భారతి కి మహిళా శక్తి అవార్డ్ వరించింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెం లోని జీ.ఎస్.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా శక్తి సాధికారత అవార్డులు గత కొన్ని ఏళ్ళుగా అనేక రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు ఈ అవార్డు అందజేస్తున్నారు.తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాలల వేదికగా ఆదివారం అవార్డుల వేడుక జరిగింది.ఈ సందర్బంగా డాక్టర్ గడల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా శక్తి ని ప్రోత్సహించే విధంగా వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారిని జీయస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఘనంగా సన్మానించడం సంతోషకరమని అన్నారు. అలాగే నేటి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అనేక లైంగిక మానసిక దాడులపై స్పందించి ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడి పనిచేస్తున్న దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భారతి ని మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న దిశగా సభ్యులను అభినందించారు.అనంతరం వేముల భారతికి మహిళా శక్తి అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి హాజరైన అధికారులు, మహిళా మణులు పాల్గొన్నారు.