Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశిస్తే రాజకీయాలలోకి వస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం డాక్టర్ గా పేషెంట్లకు సేవలు అందిస్తున్నానని.. ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రజాసేవ చేయడమే నిజమైన రాజకీయమని అన్నారు శ్రీనివాసరావు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే రాజకీయాలలోకి వస్తానని ప్రకటించారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు శ్రీనివాసరావు. అయితే ఈయన ఇప్పటికే సీఎం కేసీఆర్ తనకి పితృ సమానులని.. ఆయన పాద పద్మాలు తాకడం కూడా తన అదృష్టంగా భావిస్తున్నానని ఓసారి కొత్తగూడెంలో వ్యాఖ్యానించారు. అప్పటినుండే ఈయన రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.