Authorization
Wed April 30, 2025 11:09:53 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేడు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో పర్యటించారు. బెంగళూరు-మైసూరు 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేని ప్రారంభించారు. దాంతో పాటే వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలని కొందరు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారని, కానీ భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయగల శక్తి ఏదీ లేదని స్పష్టం చేశారు. ప్రపంచం అంతా భారత ప్రజాస్వామ్యం గురించి అధ్యయనం చేస్తుంటే, లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యక్తులు భగవాన్ బసవేశ్వరుడ్ని, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను అవమానిస్తున్నారని, ఇలాంటి వారికి కర్ణాటక దూరంగా ఉండాలని మోడీ పేర్కొన్నారు.