Authorization
Tue April 29, 2025 04:07:16 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 3 లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం ఓటర్లు 1,056,720 మంది ఉన్నారని.. వారిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓటర్లు 10 లక్షల 519 మంది అన్నారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీల ఓటర్లు 55,842 మంది ఉన్నారన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఓటర్లు 3,059 మంది ఉన్నారన్నారు. మొత్తం పోలింగ్ సెంటర్లు 1538 ఏర్పాటు చేసినట్టు ఈసీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.