Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. పవన్ కల్యాణ్ సుమారు గంట పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలపై పవన్ కల్యాణ్ గవర్నర్ తో చర్చించారు. కాగా, రేపు మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరగనుంది. పవన్ కల్యాణ్ తొలిసారిగా వారాహి వాహనం ఎక్కడి ఈ సభకు విచ్చేయనున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ సభ ద్వారా పవన్ తన కార్యాచరణ ప్రకటిస్తారని భావిస్తున్నారు.