Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (మార్చి 14) ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు షురూ అవుతాయి. ఈ నెల 16న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 24 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా వైసీపీ సర్కారు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అటు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదించనుంది.