Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాద (1984) బాధితులకు అదనపు నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నాలుగు దశాబ్దాల నాటి అంశాన్ని లేవనెత్తడం వెనక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నిస్తూ దానిని కొట్టివేసింది. విష వాయువు లీకేజీ ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుంచి ఈ పరిహారం రాబట్టే ఉద్దేశంతో ఈ పిటిషన్ వేసింది.
మూడువేలకుపైగా మరణాలు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగించిన ఈ ఘటనలో అదనంగా రూ.7,844 కోట్ల మేర పరిహారాన్ని కోరింది. గతంలో జరిగిన సెటిల్మెంట్ విషయంలో ప్రమాద తీవ్రతను సరిగా అంచనా వేయలేదని వాదించింది. ఈ తరుణంలో తాజాగా ఈ పిటిషన్ హేతుబద్ధతను కోర్టు ప్రశ్నించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సమస్యను లేవనెత్తడానికి సరైన కారణం చూపనందువల్ల కేంద్ర ప్రభుత్వ వాదనతో మేం సంతృప్తి చెందలేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.