Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. 16న(గురువారం) మరోసారి తమ ముందు హాజరుకావాలని అప్పుడే సమన్లు జారీ చేశారు.
దీంతో తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో బస చేస్తున్న ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు.
కవితపై ఈడీ విచారణ తరుణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మరికొంత మంది మంత్రులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు.