Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న కియా మోటార్స్ మరో నాలుగు కొత్త కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో సిఎన్జి, 5 సీటర్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా 2025 నాటికి ఎలక్ట్రిక్ ఎస్యువీ విడుదలచేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.
కంపెనీకి ఎక్కువ అమ్మకాలు తీసుకువస్తున్న ఉత్పత్తులలో కియా సెల్టోస్ ఒకటి. ఇది త్వరలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకానుంది. ఈ మోడల్ సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాల్లో ప్రవేశపెట్టారు. కావున ఈ ఏడాది చివరినాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.