Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్ లోని బొమ్డిలలో కూలిపోయిన ఘటనలో ఇద్దరు పైలట్లు చనిపోయారు. వీరిని లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్‌గా గుర్తించారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన ఈ హెలికాప్టర్ గురువారం ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. బొమ్డిలకు పశ్చిమ దిశలో ఉన్న మండల సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గువాహటి రక్షణ రంగ ప్రజా సంబంధాల అధికారి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ ఈ వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు. ఈ హెలికాప్టర్ సెంగె నుంచి మిస్సమరి వెళ్తుండగా కుప్పకూలింది. రంగంలోకి దిగిన గాలింపు బృందాలకు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో హెలికాఫ్టర్ శకలాలు దొరికాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు.