Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదంతో 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల పరిసరాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఆ కాంప్లెక్స్‌లో 8 మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాంప్టెక్స్ లోపల పలు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ మంటలు 7,8 అంతస్తులోని చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.