Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : డబ్ల్యూపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసే అవకాశం పొందిన గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. వికెట్లు పడకపోయినా, బ్యాటర్లు నిదానంగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులే చేసింది.
ఓపెనర్ లారా వోల్వార్ట్ 57, ఆష్లే గార్డనర్ 51, హర్లీన్ డియోల్ 31 పరుగులు చేశారు. ఓపెనర్ డంక్లే (4), హేమలత (1) సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాస్సెన్ 2, మరిజేన్ కాప్ 1, అరుంధతి రెడ్డి 1 వికెట్ తీశారు. డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, గుజరాత్ ఐదో స్థానంలో నిలిచింది.