Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఢిల్లీ
భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీనగర్లో మహిళల సమస్యల గురించి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. శ్రీనగర్ లో రాహుల్ 'మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు' అని వ్యాఖ్యానించారు. బాధితుల వివరాలు ఇస్తే తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా పోలీసులు రాహుల్ కు పలు ప్రశ్నలతో కూడిన నోటీసు పంపించారు. లైంగిక వేధింపుల గురించి ఆయనను సంప్రదించిన మహిళల గురించిన వివరాలు ఇవ్వాలని కోరారు. శ్రీనగర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మహిళలపై ఇప్పటికీ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని విన్నాను’ అన్నారు.