Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ విజృంభించడంతో టీమిండియా 39 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకుంది.
స్టార్క్ కొత్తబంతితో పేస్, స్వింగ్ కలగలిపి బంతులు విసరడంతో టీమిండియా టాపార్డర్ విలవిల్లాడింది. విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసిన స్టార్క్... మరికొన్ని ఓవర్ల తర్వాత ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (20)ను కూడా పెవిలియన్ కు తిప్పి పంపాడు. అంతకుముందు, మార్కస్ స్టొయినిస్... ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ను అవుట్ చేయడం ద్వారా టీమిండియా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు.ప్రస్తుతం భారత జట్టు స్కోరు 14 ఓవర్లకు 58గా ఉంది. క్రీజులో రాహుల్ 17, పాండ్యా 11 పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.