Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నాటకలోని గుల్బర్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో శుక్రవారం రాత్రి ఒక మానసిక రోగిపై 36 ఏళ్ల వ్యక్తి ఒకడు లైంగికదాడికి పాల్పడ్డారు. గత ఏడు నెలలుగా ఆ మానసిక రోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఇస్లామాబాద్ కాలనీకి చెందిన మెహబూబ్ పాషా మదర్సాబ్గా గుర్తించారు. రాత్రి డ్యూటీలో ఉన్నహెడ్ నర్సు మహాదేవి మాతాపతి బ్రహ్మపురి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో రోగి బంధువు ఒకరు నిందితుడిని పట్టుకుని ఆస్పత్రి భద్రతా సిబ్బందికి అప్పగించారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఐపిసిలోని 376 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి ప్రశ్నించనున్నట్లు మహాబురగి నగర పోలీసు కమిషనర్ చేతన్ ఆర్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు అనంతరం నివేదికను వైద్య విద్యా శాఖకు కూడా పంపుతామని ఆయన తెలిపారు. కాగా.. పోలీసు అధికారులు ఆస్పత్రిని సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లను తిఖీ చేశారు.