Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నివాసంలోకి ఇవాళ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆయన కోర్టు కేసు నిమిత్తం ఇస్లామాబాద్ వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టి లోపలికి ప్రవేశించారు. అవినీతి కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇమ్రాన్ ఇస్లామాబాద్ వెళ్లారు. పోలీసులు ఎంట్రీ అయిన సమయంలో ఇంట్లో తన భార్య బుష్రా బేగం ఒక్కతే ఉన్నట్లు ఇమ్రాన్ తెలిపారు. ఇది లండన్ ప్లాన్‌లో భాగంగా జరిగిన అటాక్ అని ఇమ్రాన్ తన ట్వీట్లో ఆరోపించారు. తోషాఖానా కేసులో ఇప్పటికే ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ఇంటిపైకి పోలీసులు వెళ్లగా .. ఆయన మద్దతుదారులు ప్రతిఘటించారు. అయితే తమ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో.. పోలీసులు జమాన్ పార్క్ నుంచి వెనుదిరిగి వెళ్లారు. తన ఆస్తుల డిక్లరేషన్‌లో విదేశీ గిఫ్ట్‌ల వివరాలను ఇమ్రాన్ వెల్లడించలేదని పాకిస్థాన్ ఎన్నికల సంఘం తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ కేసులో అతను విచారణ ఎదుర్కోవాల్సి ఉంది.