Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖపట్టణంలో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. తొలి వన్డేకు రోహిత్ దూరం కావడం వల్ల.. ఆ బాధ్యతల్ని హార్ధిక్ పాండ్యా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ భార్య రితికా సజ్దా సోదరుడు కునాల్ సజ్దా పెళ్లి కారణంగా .. తొలి వన్డేకు రోహిత్ దూరంగా ఉన్నాడు. అనీషా షాను కునాల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి చెందిన ఫోటోలను రితిక తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అయితే బోర్డర్ గవాస్కర్ టెస్టు ట్రోఫీలో సరిగా ఆడని కేఎల్ రాహుల్ తొలి వన్డేలో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 75 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన రాహుల్‌పై ఇప్పుడు అందరి ఆసక్తి ఉంది. రవీంద్ర జడేజా కూడా దాదాపు 8 నెలల బ్రేక్ తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడాడు. రెండు వికెట్లు తీసి, కీలకమైన 45 రన్స్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన జడేజాపై కూడా అందరూ ఫోకస్ పెట్టనున్నారు. రోహిత్ స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్‌కు రెండో వన్డేలో చోటు దక్కేది డౌట్. అయితే రోహిత్ రాకతో టాప్ ఆర్డర్ బలోపేతం కానున్నది. రెండో వన్డేలో నెగ్గి ఆధిక్యాన్ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది.