Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో లిఫ్ట్ ప్రమాదం సంభవించింది. వైరు తెగిపోవడంతో లిఫ్ట్ కిందకుపడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో మొత్తం 8 మంది ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని లిఫ్ట్ నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ లిఫ్ట్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.