Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసే దిశగా టీడీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ... పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలోనూ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 1,009 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అయితే, ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేపట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కింద కూర్చుని నిరసన తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వెలుపల వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం నినాదాలు చేశారు. వైసీపీ నేతలు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.