Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కూలింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మిస్సింగ్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాలాఘాట్ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గోండియా జిల్లా బిర్సీ విమానాశ్రయం నుంచి శిక్షణ విమానం శనివారం టేకాఫ్ అయ్యింది. అందులో ఇద్దరు ట్రైనీ పైలట్లు ఉన్నారు. అయితే ఆ శిక్షణ విమానం మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో కూలిపోయింది. అందులోని ఇద్దరు పైలట్ల జాడ తెలియలేదు. కాగా, బాలాఘాట్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంజి, కిర్నాపూర్ ప్రాంతంలోని కొండల్లో ఈ శిక్షణ విమానం కూలింది. అది కూలిన ప్రాంతానికి సమీపంలో కాలిపోయిన ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు జిల్లా ఎస్పీ సమీర్ సౌరభ్ తెలిపారు. ఆ మృతదేహం పైలట్దా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. మిస్సింగ్ అయిన మరో మహిళా ట్రైనీ పైలట్ కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.