Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినిమా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాంగోపాల్‌వర్మ మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. ఇప్పటివరకు దీనిపై సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలానే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ అవుతుంది. వర్మకు దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ వర్సిటీకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయమనండి అని సవాల్ చేశారు. నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేసి, వర్మ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని వీహెచ్ హెచ్చరించారు.