Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-విశాఖపట్నం: విశాఖలో భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు జరగనున్న రెండో వన్డేకు వరుణుడి అడ్డంకులు తప్పేలా లేదు. నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్ర, శనివారం కురిసిన వర్షాలతో మ్యాచ్ జరగనున్న ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఆదివారం ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్కు వర్షం ముప్పు ఉండటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి కూడా వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. వర్షం తగ్గినా మ్యాచ్ పూర్తి ఓవర్లు సాగడం కష్టమేనని భావిస్తున్నారు. ఆదివారం కావడంతో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు చాలా మంది టికెట్లు కొనుగోలు చేశారు. మరోవైపు సెలవురోజు కావడంతో టీవీల్లో మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వరుణుడు ఈ మ్యాచ్ను సజావుగా సాగనిస్తాడా? లేదా? అనే సందేహంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.