Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల కేంద్రంలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు చేపట్టనున్న ఈ దీక్షకు అందరూ తరలిరండని ఆయన పిలుపునిచ్చారు. గాంధారి శివాజీ చౌక్ వద్ద నిరుద్యోగ నిరసన ఈ దీక్షను చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి. ఉదయం 9గంటలకు జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్రగా రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్‌తో ఈ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. మంత్రి కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాన డిమాండ్ల తో దీక్ష చేయనున్నారు.