Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గర్భిణీపై భర్త లైంగికదాడి చేస్తుండగా భార్య వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన దారుణ సంఘటన ఒడిశా రాష్ట్రం నబరంగ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఖతీగూడ పోలీస్ స్టేషన్ పరదిలో పద్మ రుంజికర్ల అనే ఆశావర్కర్ తన భర్త లిలియా రుంజికర్తో కలిసి ఉంటుంది. లిలియా రుంజికర్కు తనకు వరసకు మరదలైన గర్భిణీ కన్ను పడింది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గర్బిణీని ఆశావర్కర్ పద్మ ఓ ఇంటికి పిలిపించింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా పిలిచి ఉంటుందని గర్భిణీ వెళ్లింది. గర్భిణీపై భర్త లైంగికదాడి చేస్తుండగా భార్య వీడియో తీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో గర్భిణీ ఎవరికీ చెప్పకుండా మానసిక వేదనకు గురైంది. మానసిక వేదనతో ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారు. జరిగిన విషయం చెప్పాలని కుటుంబ సభ్యులు అడగడంతో చెప్పింది. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దంపతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వాటిని తొలగించారు.