Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ పోలీసులు ఆదివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇంటికి చేరుకున్నారు. మహిళలపై ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై ఆయన నుంచి స్పష్టత తీసుకోవడానికి పోలీసులు ఈరోజు ఇంటికి చేరుకున్నారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) సాగర్ ప్రీత్ హూడా నేతృత్వంలో పోలీసుల బృందం తుగ్లక్ లేన్‌లో ఉన్న రాహుల్ నివాసానికి చేరుకుంది. సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఆయనకు ఒక ప్రశ్నావళి పంపినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామంటూ ఆయన్ని సంప్రదించిన మహిళలెవరో చెప్పాలని కోరినట్లు పేర్కొన్నారు. తద్వారా వారికి మరింత భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌లో మహిళల లైంగిక దాడుల అంశాన్ని ప్రస్తావించారు. యాత్రలో భాగంగా తనని కొంతమంది మహిళలు కలిశారని.. ఇప్పటికీ తాము లైంగిక దాడులు ఎదుర్కొంటున్నామని వాపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో అలా రాహుల్‌ను ఆశ్రయించినవారి జాబితాను తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు.