Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నిజామాబాద్ పట్టణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని వెనుక నుండి ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో మధ్యలోకి ఒ ప్రైవేట్ కారు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న కామారెడ్డి పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన కాన్వాయ్ లో నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.