Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వనపర్తి
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో భారీ మొసలిని ఆదివారం పట్టుకున్నారు. స్థానిక రైతుల కథనం మేరకు.. వెల్టూరు గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి తన వరి పొలంలో మొసలిని గుర్తించి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డికి సమాచారం అందజేయగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు, స్థానికులు కలిసి పొలంలో గాలింపు చర్యలు చేపట్టారు. నీళ్ల కుంటలో దాగి ఉన్న మొసలిని హిటాచీ సాయంతో బయటికి తీసి బంధించారు. మొసలి 12 ఫీట్ల పొడవు, 270 కేజీల బరువు ఉందని ఈ మొసలి జూరాల కాలువ ద్వారా పెద్ద చెరువులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పట్టుకున్న మొసలిని వాహనంలో తీసుకెళ్లి జూరాల ప్రాజెక్టులో వదిలేస్తామన్నారు.