Authorization
Tue April 29, 2025 05:26:15 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారం తెరపైకి రాగా, రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని అన్నారు. దాంతో, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు అందించాలని సిట్ అధికారులు నోటీసుల్లో కోరారు. నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని అన్నారు.