Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడంతోపాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా కారుణ్య నియామకాల ద్వారా 1,606 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇప్పటికే డ్రైవర్లుగా 20, కండక్టర్లుగా 1,226, శ్రామిక్స్గా 62, కానిస్టేబుళ్లుగా 298 మందికి ఉద్యోగాలు కల్పించిన టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో 166 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేసింది. వీరిలో 39 మందిని గ్రేటర్ హైదరాబాద్ జోన్లో, 68 మందిని హైదరాబాద్ జోన్లో, 59 మందిని కరీంనగర్ జోన్లో నియమించింది.