Authorization
Wed April 30, 2025 06:36:29 am
నవతెలంగాణ - తిరుమల
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. ఇది భారీ డొనేషన్ కావడంతో తిరుమలలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లే స్క్రీన్లపై దీన్ని ప్రదర్శించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకు టీటీడీ అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది.