Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాలలో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇళ్లలో సిట్ అధికారులు తనిఖీలు చేశారు. మూడు చోట్ల అధికారుల దర్యాపు చేస్తున్నారు. రాజశేఖర్ సొంతూరు జగిత్యాల జిల్లా తాటిపల్లికి కూడా అధికారులు వెళ్లారు. రేణుకతో పాటు భర్త నాయక్‌తో కలిసి ముందుగా లంగర్‌హౌస్‌కు వెళ్లారు. సన్ సిటీలోని కాళీ మందిర్‌కి వెళ్లి అనుమానితులను ప్రశ్నించారు. రేణుక సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా గండ్వీడ్‌కు సిట్ బృందం వెళ్లింది.
మరోవైపు టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో వాటి పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పరీక్ష పేపర్లతోపాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల పరిరక్షణ కోసం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఐఏఎస్ స్థాయి కస్టోడియన్ అధికారిని నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.