Authorization
Tue April 29, 2025 08:01:48 pm
నవతెలంగాణ-విశాఖ: భీమిలి వలందపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ఢీకొన్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాడే దుర్గాప్రసాద్, పట్నాల సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు.