Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1 పరీక్ష రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై ఆరా తీసింది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను తెలుసుకుంటోంది. ఈ తరుణంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో మరో ఇద్దరికి గ్రూప్-1లో భారీగా మార్కులు వచ్చినట్లు గుర్తించింది. 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందిన షమీమ్‌కు 127 మార్కులు, టీఎస్పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్ బృందం గుర్తించింది. లీకేజీ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్ నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం తీసుకున్నట్లు షమీమ్ తెలిపాడు. దీనికోసం డబ్బులేమీ తీసుకోలేదన్నాడు.