Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసింది. ఇక, ఐపీఎల్ సందడి షురూ కానుంది. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ దాదాపు రెండు నెలలపాటు అలరించనుంది. ఆసీస్తో వన్డే సిరీస్లో ఆడిన టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో తమ తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోనున్నారు. ఇదిలా ఉండగా, గతేడాది ఐపీఎల్లో 22.73 సగటుతో 341 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేస్తాడని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని చెప్పాడు.కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనింగ్ చేయాలని, రజత్ పాటిదార్ని ఫస్ట్ డౌన్లో పంపాలని సూచించాడు. ‘ఆర్సీబీలో డుప్లెసిస్, విరాట్ కోహ్లీలలో ఎవరు అత్యధిక పరుగులు చేస్తారని ప్రశ్నిస్తే.. నేను కోహ్లీ వైపు మొగ్గుచూపుతాను. గతేడాది విరాట్ ఆశించిన మేరకు పరుగులు చేయలేదు. ప్రతి సంవత్సరం అలా జరగదు. అతను ఈ సారి రాణిస్తాడు. ఆర్సీబీ టీమ్ కాస్త బలంగా కనిపిస్తోంది.