Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయడం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. మరోవైపు ఈ అంశంపై మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇప్పటికీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటో రాబోయే రోజుల్లో అందరూ చూస్తారని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసిందెవరో తమకు తెలుసని... వాళ్లు డబ్బుకు అమ్ముడుపోయారని ఆరోపించారు.