Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లను సిట్ సాక్షులుగా చేర్చింది. అయితే సాక్షుల జాబితాలో చేర్చిన వారిలో కర్మన్‌ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని, సిబ్బంది కూడా ఉన్నారు. ఈ నెల 4న ఆర్ స్క్వేర్ హోటల్లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్లో ప్రశ్నాపత్రం చూసి ఇద్దరు నిందితులు ప్రిపేర్ అయ్యారు. ఆ తర్వాత నేరుగా పరీక్షా కేంద్రానికి నీలేష్, గోపాల్ వెళ్లారు. హోటల్లో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు.