Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రాహుల్ కు జైలు శిక్ష తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీ ఎంపీలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. విపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు నేడు పార్లమెంట్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ తరుణంలో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే సభలు మరోసారి వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలో తొలుత పార్లమెంట్ ప్రాంగణంలో నిరసైన చేపట్టిన ప్రతిపక్ష ఎంపీలు ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ వరకు ప్రదర్శన చేపట్టాయి. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అంటూ భారీ బ్యానర్ పట్టుకుని కాంగ్రెస్ సహా సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీ నేతలు ర్యాలీ చేపట్టాయి. అయితే, వీరి ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. కొందరు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో విజయ్ చౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.