Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు వేయడం.. రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమే అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో రాహుల్‌పై వేటు వేశారని, ఇది తొందరపాటు చర్య అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్వవేత్త వాల్టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్‌ను కేటీఆర్ తన ట్వీట్లో షేర్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు మార్చి 23వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియేట్ తెలిపారు. ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీపై వేటు పడింది. నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా తేలినందు వల్లే రాహుల్‌కు అనర్హత తప్పలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ తన లేఖలో తెలిపారు. దీంతో రాహుల్ గాంధీ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.