Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీరామచంద్రుడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పల్లకీలో స్వామివారిని ఊరేగించారు. భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. వాహనసేవలో తిరుమల చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేష్, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.