Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు. కేంద్ర కేబినెట్ శుక్రవారం కరువుభత్యాన్ని (డీఏ) 4శాతం పెంచింది. దీంతో ఇది 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. ఈ పెంపుతో 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు మూలంగా కేంద్ర ప్రభుత్వంపై వార్షికంగా రూ.12,815 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. డీఏ పెంపు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. మరోవైపు, పీఎం ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని ప్రభుత్వం శుక్రవారం మరో ఏడాది పాటు పొడిగించింది. ముడి జనుము కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను ప్రభుత్వం రూ.300 పెంచింది.