Authorization
Wed April 30, 2025 04:37:28 pm
నవతెలంగాణ - అమరావతి
శ్రీసత్యసాయి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో యువనేత 50వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగనుంది. మూడు రోజుల విరామం తరువాత శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఒనుకువారిపల్లి విడిది కేంద్రంలో సెల్పీవిత్ లోకేష్ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేస్ ఇప్పటి వరకు 625 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.