Authorization
Thu May 01, 2025 09:12:40 am
నవతెలంగాణ - హైదరాబాద్: సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై కొందరు కూలీలు మొక్కలు కట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఘటనలో ఖమ్మంలో ఓ బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతులను మేడిపల్లికి చెందిన శివరామకృష్ణ, ఉదయ్‌కుమార్‌గా గుర్తించారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.